
రక్షించే పోలీసులే ఇలా లంచాల కోసం కొట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో పోలీసుల ఆగడాలు వీధిన పడ్డాయి. లంచాలు పంచుకునే విషయంలో నలుగురు పోలీసుల మధ్య విభేధాలు తలెత్తడంతో ఒకరినొకరు నడిరోడ్డుమీదే తన్నుకున్నారు. జనమంతా పోగై పోలీసులు కొట్టుకోవడానికి ఆసక్తిగా చూశారు. రోడ్డున పోయే ట్రక్కులు, వాహనాల డ్రైవర్ల నుంచి వసూలు చేసిన లంచాలను పంచుకోవడంలో వీరికి పొంతన పొగసలేదు. మాటామాటా పెరిగి అది ఘర్షణ రూపం దాల్చింది.
ఒకరినొకరు ఇలా రోడ్డు మీద తన్నుకోవడానికి జనం వీడియో తీశారు. మరో పోలీసులు వచ్చి వారించినా వినకుండా పైటింగ్ చేసుకున్నారు. ఈ పోలీసుల వీడియో బయటకు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.