Breaking News

మన పీఎఫ్ కు ఇక కంపెనీకి సంబంధం లేదు..

EPF

పీఎఫ్( ప్రావిడెంట్ ఫండ్) ను ఎప్పడంటే అప్పుడు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వెసులుబాటు కల్పించింది. ఈపీఎఫ్ఓ ఉద్యోగుల భవిష్యనిధి సంస్త నుంచి ఇక ఉద్యోగి కంపెనీ ధ్రువీకరణ సంబంధం లేకుండానే తమ పీఎఫ్ సొమ్మును తీసుకునేలా విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఉద్యోగులకు యూనివర్సల్ అకౌంట్ నంబర్(యూఏఏన్) దరఖాస్తు ఫారం డి లో ప్రవేశపెట్టింది. ఈ దరఖాస్తును నేరుగా ఈపీఎఫ్ కార్యాలయంలో ఉద్యోగి ఇచ్చి తమ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. దీంతో పాటు ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు తప్పనిసరిగా యూఎఎన్ తో అనుసంధానం అయ్యి ఉంటాయి. పనిచేసిన కంపెనీ డిజిటల్ సంతకం, ఉద్యోగి పూర్తి వివరాలు ఫారం 11లో పొందుపరచబడి ఉంటాయి.. వీటిని సంస్థ అవసరం లేకుండా ఈపీఎఫ్ఓ ఇక ఉద్యోగులకు పీఎఫ్ డబ్బు చెల్లిస్తుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *