రౌండ్ ఫిగర్ లో పెట్రోల్ కొట్టిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!!

నెలంతా కష్టపడి ఉద్యోగం చేసి.. జీతం వచ్చాక వాటికి వీటికి పోను.. మిగిలిన డబ్బుని పొదుపు చేసుకుందాం అనుకుంటారు ప్రతీ ఒక్కరు. కానీ పొదుపు చేసుకోవాలనుకున్న డబ్బు కాస్తా ఆఫీస్ కి రాను పోను బండిలో పెట్రోల్ కొట్టించుకోడానికే సరిపోతున్నాయి. జీతం వచ్చిన మొదట్లో వెయ్యి రూపాయలో, ఐదు వందలో పెట్టి పెట్రోల్ కొట్టిస్తాం.. నెలాఖరుకి అది కాస్తా యాభై లేదా వందకి దిగిపోతుంది. ఓ మిడిల్ క్లాస్ ఉద్యోగి కష్టాలు అలాంటివి లెండి.

వినియోగదారులను దోచుకోవడం లో నాలుగు ఎక్కాలు ఎక్కువే చదివారు పెట్రోల్ బంక్ వాళ్ళు. వీరి దగ్గర జారుగుతున్న మోసాలతో పోలిస్తే… మిగితావన్నీ చిన్నగా అనిపీయడం ఖాయం. ఇప్పుడు వీరు ఓ కొత్త రకం మోసానికి తెరలేపారు. చిల్లరకు కష్టపడం దేనికని రౌండ్ ఫిగర్ లో పెట్రోల్ కొట్టించుకుంటాం. అంటే 50, 100, 200, 500…. ఇలా అనమాట. కానీ ఇలా కొట్టించడం ద్వారా లీటర్ పెట్రోల్ కు 200 మీ.లీ పెట్రోల్ తక్కువ వస్తుందని ఈ మధ్య సోషల్ మీడియా లో తెగ వార్తలు వస్తున్నాయి. వీరి సమాచారం ప్రకారం… రౌండ్ ఫిగర్ కాకుండా… అంటే 10 రూపాయలు తక్కువో ఎక్కువో కొట్టించుకుంటే మేలు అంటున్నారు.

ఈ విషయం వినియోగదారులకు తెలియక మోసపోతున్నారని… సోషల్ మీడియా ద్వారా అయితే ఎక్కువ మందికి చేరుతుందని… ఈ వార్తను తెగ షేర్ చేస్తున్నారు. ఈ వార్త ప్రకారం… మన జాగ్రత్తలో మనముంటే మంచిది కదా?? అందుకే ఈ సారి పెట్రోల్ కొట్టించేటప్పుడు పదో.. ఇరవైయో… ఎక్కువ కొట్టిస్తే సరిపోతుంది.

దయచేసి ఈ సమాచారాన్ని అందరితో షేర్ చేయండి. వారికి కూడా ఈ కొత్త రకం మోసం గురించి అవగాహన కలిపించండి!!

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *