పేదొళ్లు ఎవరు.. సంక్షేమ పథకాలు ఎవరికి అందాలి..?

సొంత ఇల్లు లేదు..చిన్న చిన్న ప్రయివేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు..వీరికి స్థిరమైన ఆదాయం లేదు..నెలకి పది వేలు లేదా పదిహేను వేల సంపాదన..అలాగని వృత్తి కూలీ అని రాయించుకోలేరు…సోకాల్డ్ అగ్రవర్ణంలో లేదా ఓసీ కులాల్లో పుట్టారు …నిరుపేదల కోటాలో పథకాలు పొందలేరు..పోనీ బ్యాంకు లు వీళ్లకి రుణాలు ఇస్తాయా అంటే ఇవ్వవు.ఎందుకంటే బ్యాంకు ల నిర్దేశిత ప్రమాణాల్లో వీరు సరిపోరు.. అలాగని స్యూరిటీలు ఇచ్చుకోలేరు.ఆస్తి.. ఆదాయం లేదు కనుక వీళ్ళకి బయట అప్పులు పుట్టవు…ఎవరైనా ఇచ్చినా అధిక వడ్డీలు.. ఆపై వేధింపులుఏ సరుకు కొనాల్సి వచ్చినా తప్పని ఇన్ స్టాల్ మెంట్లుతెల్ల కార్డులుండవు.. ఆరోగ్యశ్రీ వర్తించదుపిల్లలని సరైన స్కూల్ లో చేర్పించలేరు..ఫలితంగా వీరి తర్వాత తరానిదీ ఇదే బతుకు…తిండీ తిప్పలూ మానేసి కాస్త కూడబెట్టుకొని, యాభై గజాలో వంద గజాలో స్థలం కొనుక్కుందాం అంటే రేట్లు అందుబాటులో ఉండవు.. బ్యాంకు స్థలానికి అప్పు ఇవ్వదు. ఏదోవిధంగా స్థలం సమకూర్చుకున్నా మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి ఇదే సమస్య. స్థలాన్ని, కట్టే ఇంటినీ చూసి కాకుండా.. వ్యక్తి సంపాదనని చూసి అప్పు ఇచ్చే విధానం బ్యాంకులది. వీళ్ళకి లేనిది, బ్యాంకు కి కావలసింది ఒక్కటే. దీంతో జీవితాంతం వీళ్ళు అద్దె ఇళ్ళకి, ఇన్ స్టాల్ మెంట్లకి, బయటి అప్పుల వడ్డీలకి తమ సంపాదన ధారపోస్తూదుర్భరంగా జీవించాల్సిందే.ఇదీ ఇవాళ దేశంలో పెరిగిపోతున్న జనాభానేను ఇక్కడ చెబుతున్నది.. ప్రభుత్వానికి తమ గురించి పూర్తి నిజాలు చెప్పేవాళ్ళ సం”గతి”…వార్షికాదాయం 72 వేల లోపు ఉంటేనే పేదలనేది ప్రభుత్వ కొలమానం. కొన్ని కులాల్లో పుడితేనే సంక్షేమ పథకాలకు అర్హత అనేది ఓటు బ్యాంకు రాజకీయాల పర్యవసానం

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.