‘స్వచ్ఛత’ పెద్దపల్లే టాప్..

మరుగుదొడ్లు, స్నానాల గదులు, ఇంకుడు గుంతల నిర్మాణంలో పెద్దపల్లి నియోజకవర్గం 100శాతం సాధించి తెలంగాణలోనే తొలిస్థానాన్ని సంపాదించింది. రాష్ట్రంలోనే ఈ విషయంలో టాప్ లో నిలిచిందని స్వయంగా మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. పెద్దపల్లి లో నిర్వహించిన స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు పాల్గొని ఈ మేరకు ప్రకటించారు.  తెలంగాణ ప్రభుత్వం మరుగుదొడ్లకు నిధులిస్తే స్నానాల గదులను కూడా లబ్ధిదారులు నిర్మించుకున్నారని.. తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన 15604 మరుగుదొడ్లను అనతికాలంలోనే పూర్తి చేశారని ప్రశంసించారు.

కాగా తెలంగాణలోనే సంపూర్ణ మరుగుదొడ్లు నిర్మించుకున్నట్టు పెద్దపల్లిని అధికారికంగా ప్రకటించారు. మంత్రితో పాటు కలెక్టర్ నీతూ ప్రసాద్, జేసీ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *