పవన్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది…

అన్న చాటు తమ్ముడిగా తెరంగేట్రం చేసి అంచెలంచెలుగా ఎదిగిన పవన్ కు సైతం అంతే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది .. పవన్ కు ఉన్న విభిన్న మనస్తత్వం ఆయన్ను అభిమానుల గుండెల్లో పెట్టింది. ఎక్కడైనా బాధతో ఎవరైనా కనపడితే వారికి ఆస్తి మొత్తం రాసిచ్చేంత దయాగుణం పవన్ ది.. అందుకే ఆయన కంట పడినా.. ఆయన కార్యాలయానికి వచ్చిన బాధితులందరికీ త్రుణమో, ధనమో ఇచ్చి పంపించేస్తుంటారు పవన్.. ఆ గుణమే ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీరోల్ ను చేసింది..

చిరంజీవి ఆడియో వేడుకలో పవన్ పై ఉన్న అభిమానమే.. ఆయన అభిమానుల్ని ఆగ్రహోశక్తుల్ని చేసింది. పవన్ రాలేదన్న బాధతో పెద్ద ఎత్తున సభకు హాజరైన పవన్ అభిమానులు ఫంక్షన్ ముగిశాక కుర్చీలను విరగ్గొట్టి కుప్పగా పోశారు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. జై పవన్ అంటూ నినాదాలు చేశారు.. అన్న ఫంక్షన్ కు వస్తే పవన్ ను చూడాలనుకున్నామని కానీ ఇలా నిరాశపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు..  

చిరు ఫంక్షన్ లో పవన్ రాలేదని ఆయన అభిమానులు చేసిన విధ్వంసాన్ని కింద లింక్ లో చూడొచ్చు..

https://www.facebook.com/batukumuchatlu/videos/1836361583272539/

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *