పవన్, కేసీఆర్ కలుసుకోబోతున్నారు..

522930564

ఒకరు రాష్ట్రం తెచ్చిన నేతగా పేరు తెచ్చుకున్నారు. మరొకరు రాష్ట్ర హక్కును సాధించుకోవడం కోసం ఉద్యమిస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు ఒకే వేదికపైకి వస్తున్నారు. వారు మరెవరో కాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్. వీరిద్దరూ కలుసుకోబోతున్నారు. అయితే రాజకీయ వేదికపై కాదు. అది రాజకీయ భేటీ అంతకన్నా కాదు. ఓ ఆడియో వేడుకకు ఈ ఇద్దరు నేతలు హాజరుకాబోతున్నట్లు తెలిసింది. మాజీ ప్రధాని దేవగౌడ మనుమడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా నటించిన తొలి చిత్రం జాగ్వార్. దాదాపు 75 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ సినిమా తెరకెక్కింది. సెప్టెంబర్ 18న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరగబోతోంది.ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం కుమారస్వామి జనసేన అధినేతతో భేటీ అయ్యారు. ఆడియో విడుదల వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. పవన్ కూడా అంగీకరించినట్లు తెలిసింది. పవన్‌ను కలిసిన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కూడా ఆయన భేటీ అయ్యారు. కేసీఆర్ కూడా ఆడియో విడుదలకు వెళతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదేగానీ జరిగితే ఈ ఇద్దరు ఒకే వేదికపై కనువిందు చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ఈ ఆడియో వేడుకకు ఇద్దరూ వెళతారా, లేదా అనే విషయం తెలియాలంటే సెప్టెంబర్ 18వరకూ వేచిచూడాల్సిందే.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *