కోళ్లు తినండి.. అవే చీప్..

రంజాన్ వేళ పండుగ చేసుకుందామంటే పాకిస్తాన్ ధరలు బేజారెత్తిస్తున్నాయట.. దేశంలో పప్పుల ధరలు పెరిగిపోతున్నాయంటూ మీడియా, ప్రజలు ఆందోళన చెందుతున్న వేళ పాకిస్తాన్ దేశ ఆర్థిక మంత్రి చేసిన ఈ  ప్రకటన ప్రజల్లో మరింత ఆగ్రహాన్ని కలిగింది..
ఈసారి కరువు కరాళ నృత్యం చేయడంతో అన్ని పప్పులు, నితావ్యసరాల ధరలు ఆకాశాన్నంటాయి. పాకిస్తాన్ లో కిలో రూ.260 పైనే ఉన్నాయి. దీంతో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. విలేకరుల సమావేశంలో మీడియా ప్రతినిధులు ఇదే విషయమై ఆర్థిక మంత్రిని ప్రశ్నించారు.. దానికి ఆయన ‘ పప్పుల ధరలు 260 అయితే ఏముంది.. చికెన్ రూ.200కే దొరుకుతుంది కదా.. దాన్ని తినమనండి’ అంటూ ఉచిత సలహా ఇచ్చాడట.. ఇంకేముందు ఈ మంత్రి వ్యాఖ్యలపై అందరూ మండిపడుతున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *