P.F. ప్రథమ వార్శికోత్సవ శుభాకాంక్షలు

హైదరాబాద్ : తెలుగు వెబ్ సైట్లలో ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన పొలిటికల్ ఫ్యాక్టరీ ప్రథమ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సరిగ్గా పోయినేడాది ఇదే రోజు హైదరాబాద్ లో పొలిటికల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. 13-04-2014 న సీనియర్ పాత్రికేయులు అయిలు రమేశ్ సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ వెబ్ సైట్ అంచలంచెలుగా ఎదిగి తెలుగు వెబ్ సైట్లలోనే కొత్త ఒరవడిని సృష్టించింది.

naresh-political factory luanch2

 

అంతర్జాతీయ , దేశీయ, రాష్ట్రీయ వార్తలంటూ హంగామా చేసే వెబ్ సైట్లకు భిన్నంగా ప్రాంతీయతను జోడించి గ్రామ స్థాయి నుంచి పట్టణ, నగర జన జీవన స్రవంతిలోకి చొచ్చుకెళ్లింది. సర్పంచ్, ఎంపీటీసీ నుంచి మొదలుకొని ఎమ్మెల్యే, మంత్రులు, సీఎం వరకు క్షేత్ర స్థాయి వార్త సేకరణను చేసి కొత్త పంథాను సృష్టించింది. ఈ ఒరవడే తెలుగు వీక్షకుల ఆదరణకు కారణమైంది.

naresh-political factory luanch23

పంచ్ పఠాకా.. పొలిటికల్ ఫ్యాక్టరీ సంధించిన కథనాలు.. రాజకీయ నేతలకు హడల్ పుట్టించాయి. జనాలకు కిక్కెంచాయి. అవినీతి పరుల అసలు నైజాన్ని ఆవిష్కరించాయి. ప్రభుత్వ లోటు పాట్లను ఎత్తిచూపాయి. తెలంగాణ గోసను ఆవిష్కరించాయి. ప్రతిపక్షాలను నిద్దుర లేపాయి. ఒక్కటేమిటి తన, మన తేడా లేకుండా సాగిన  పొలిటికల్ ఫ్యాక్టరీ కథన కుతూహలం ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేస్తూనే ఉంది. మొదటి ఏడాది పూర్తి చేసుకొని రెండో ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రే క్షకుల ఆశీస్సులు, శుభాకాంక్షలు అందుకుంటుంది.

Political Factory -Powered By Democracy

Lets make Quality Politics

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *