రెండున్నర లక్షలు దాటిన డిపాజిటర్ లకి నోటీసులు మొదలు

income-tax-notice

మోడీ పెద్ద నోట్ల రద్దు అంశం డబ్బు ఎక్కువగా ఉన్నవారికి తీవ్ర ఇబ్బందులు రేపుతోంది. ప్రతీ రోజు సాయంత్రం ఆరు తరవాత ఏ సేవింగ్స్ ఖాతా లో అయినా రెండున్నర లక్షల కంటే ఎక్కువ డబ్బు ఉంటె ఆ వివరాలు తమకి ఇవ్వాలి అని ఐటీ అధికారులు బ్యాంకు లకీ , పోస్ట్ ఆఫీసులకీ స్ట్రిక్ట్ ఆర్డర్ లు పాస్ చేసారు. అధిక విలువ ఉన్న పాత నోట్లని బ్యాంకులలో జమ చెయ్యడం కోసం డిసెంబర్ నెలాఖరు వరకూ సమయం ఉండగా గత వారం రోజుల్లో బ్యాంకులకి వచ్చిన భారీ మొత్తాల మీద ఇప్పటికే ఐటీ అధికారులు కన్నేశారు.
అనుమానంగా ఉన్న డిపాజిట్ లూ , ఆస్తుల కొనుగోళ్ళు మీద నోటీసులు పంపడం మొదలు పెట్టినట్టు చెబుతున్నారు. ఇక కరెంటు ఖాతాలను కలిగివున్న వారిలో రూ. 12.5 లక్షలు మించి వున్నా కూడా వాటిపై దృష్టిని సారించింది. ఇప్పటికే రూ. 50 వేలు పైబడిన డిపాజిట్లపై పాన్ కార్డును తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొందరు ఏభై వేల మొత్తానికి కాస్త తక్కువగా డిపాజిట్ చేసుకుంటూ వెళుతున్నారు.
దీనిని గమనించిన అధికారులు నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 మధ్యలో ఆయా అకౌంట్లలో మొత్తం డిపాజిట్ రూ. 2.5 లక్షలు దాటిన పక్షంలో పాన్ కార్డు సంఖ్యను బ్యాంకులు కచ్చితంగా తీసుకోవాల్సిందేనని ఐటీ అధికారుల నుంచి బ్యాంకులకు ఆదేశాలు అందాయి.
ఇక అధిక మొత్తంలో డిపాజిట్లు వేసిన వారికి, పెద్ద నోట్ల రద్దు తరువాత ఆస్తులను కొనుగోలు చేస్తున్న వారికీ నోటీసులు అందుతుండటంతో, అక్రమార్కులు తప్పించుకునే దారి తెలియక ఆందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *