ఆపరేషన్ సక్సెస్.. పేషంట్..?

0012

మోడీజీ పెద్ద నోట్లు రద్దు నిర్ణయం మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. నోట్లు మార్చుకోలేక సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే … నల్ల కుబేరులు అడ్డదారుల్లో డబ్బును చెలామణీలోకి తీసుకొస్తున్నారు.. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు ఎంత మోడీజీ పెద్ద నోట్లను రద్దు చేసినా బడాబాబులు సర్దుకున్నారు. అందుకే ఇప్పటివరకు నల్ల కుబేరుల నుంచి వసూలైన మొత్తం కేవలం 3 లక్షల కోట్లేనట.. మోడీ నల్ల ధనం అంచనా 17 వేల కోట్లు కాగా.. 3 నుంచి 4 లక్షల కోట్లు మాత్రమే వసూలు కావడంతో మోడీ అంచనాలకు తగ్గట్టు ఇంకా నల్లధనం బయటకు రాలేదనే చెప్పాలి.

కాగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, సామాన్యులు మోడీ నిర్ణయం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకే రోజు వేల కోట్లు రద్దు చేయడంతో దేశం మొత్తం బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తుందని మండిపడ్డారు. దీనిపై ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ సీఎంలు కేజ్రీవాల్, మమతలో దేశ రాజధాని ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్రానికి 3 రోజులు గడువు ఇచ్చారు. ఆలోగా పెద్ద నోట్లను చెలామణీలోకి తీసుకురాకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. దీంతో మోడీ తీసుకున్న ఈ పెద్ద నోట్ల రద్దు ఆపరేషన్ వికటించిందా.. పేషంట్ చనిపోయాడా అని మరో కొద్దిరోజుల్లో తేలనుంది. ప్రస్తుతానికి జనం అష్టకష్టాలు చూశాకా ఇది తొందరపాటు నిర్ణయమేనని అర్థం అవుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *