
తెలంగాణ ప్రభుత్వం ఆన్ లైన్ మీడియాను అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలను తీసుకుంటుందని తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం ప్రకటించారు . ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో ఆన్ లైన్ మీడియా – సామాజిక బాధ్యత అనే అంశం పై నిర్వహించిన సెమినార్ లో ప్రసంగిస్తూ ఈ మేరకు ప్రకటించారు . కానీ అదే సమయం లో ఆన్ లైన్ మీడియా తన సామాజిక బాధ్యతలను గుర్తెరిగి భావ ప్రకటన స్వేచ్స ను దుర్వినియోగపరచ వద్దని విజ్ఞప్తి చేశారు . తెలంగాణ ప్ర
భుత్వం త్వరలోనే ప్రెస్ అకాడెమీ, ఐ అండ్ పిఆర్ ల సమన్వయము తో ఆన్ లైన్ మీడియా గుర్తిం పు కై విధి విధానాలు రూపొందిస్తామని ప్రకటించారు .

మన తెలంగాణా ఎడిటర్ కె . శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాతో పోల్చితే ఆన్ లైన్ మీడియా కు సామాజిక బాధ్యత ఎక్కువగా ఉంటుందని అన్నారు . అలాగే భావ ప్రకటన స్వేచ్స ఉందని, హద్దులు మీరితే ప్రభుత్వం కూడా ఆ వ్యక్తుల పై చర్యలు తీసుకోడానికి చట్టాలను ఉపయోగించ వచ్చుఁ
, కానీ ప్రభుత్వాలు సామాజిక మాధ్యమాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తే అప్రజాస్వామికం
అవుతుంది అన్నారు .

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ ఆన్ లైన్ మీడియా ను సామాజిక మాధ్యమాలతో విడిదీసి చూడలేమని , ఎందుకంటే వేగం, నియంత్రణ లేకపోవడం కారణాల వలన తప్పులు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు .
తెలంగాణా టుడే ఎడిటర్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆన్ లైన్ మీడియా, సోషల్ మీడియా లు పరస్పరం ఆధార పడి నడుస్తున్నందున , వాటిని వేరు వేరుగా చూడలేమని అభిప్రాయపడ్డారు .
హిందూ బిజినెస్ లైన్ డిప్యూటీ ఎడిటర్ కూర్మనాథ్ మాట్లాడుతూ ఆన్ లైన్ మీడియాకు , సోషల్ మీడియాకు బాధ్యత పరంగా చాలా వ్యత్యాసం ఉందని , వ్యక్తి గత అభిప్రాయాలు తెలపడానికి సోషల్ మీడియా ఉపయోగపడితే , ఆన్ లైన్ మీడియాలో ఆ స్వేచ్స చాలా పరిమితంగా ఉంటుందని, సామాజిక బాధ్యత కలిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు . ఏది ఏమైనప్పటికీ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాల్సిన అవసరం ఏర్పడిందని , రాబోయే రోజుల్లో భవిష్యత్తు అంతా ఆన్ లైన్ మీడియా దే అని అన్నారు .
తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రా
ర్ ప్రొఫెసర్ సత్తి రెడ్డి మాట్లాడుతూ ఆన్ లైన్ మీడియాకు సామాజిక బాధ్యత ఉంటుందని, నిజాయితీగా వార్తలు పెడితే ప్రజాదరణ వస్తుందని , అదే గుర్తింపునకు గీటు రాయి అవుతుందని అన్నారు .

నమస్తే తెలంగాణా డిప్యూటీ ఎడిటర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ మధ్య కాలం లో ఆన్ లైన్ మీడియాకు ప్రాధాన్యత పెరుగుతున్నందున మాలాంటి మధ్య తరం జర్నలిస్టు లకి డిజిటల్ మీడియా కు మారాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది .
కార్యక్రమానికి అధ్యక్షత వహిం
చిన తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అయిలు రమేష్ మాట్లాడుతూ రాష్ట్రం లో ఆన్ లైన్ మీడియాకు గుర్తింపు ఇవ్వాలని , వాటిని ప్రోచ్సహించడానికి ప్రకటనలతో పాటు, జర్నలిస్టులకు అక్రిడిటేషన్ లు ఇవ్వాలని కోరారు . ప్రస్తుతం క్షణాల్లో వార్తలు అందిస్తున్న ఆన్ లైన్ మీడియా నేనని భవిష్యత్త్తు అంతా ఆన్ లైన్ మీడియా పై ఆధారపడాల్సిన పరిస్థితి రాబోతుందని అన్నారు

అలాగే తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ధర్మాసనం మాట్లాడుతూ ఆన్ లైన్ మీడియాకు గత సంవత్సరం దేశం లో నే మొదటిసారిగా ఇఛ్చిన గుర్తింపుని రద్దు చేయడం బాధాకరమని , దానిని పునరుద్దరించారాలని కోరారు .
వీరితో పాటు తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజగోపాల్ , హనుమంత రావు , కార్యదర్శి కళ్యాణం శ్రీనివాస్ , కోశాధికారి సదానందం , రాష్ట్ర నాయకులు నరసింహ రావు , కోడం సంతోష్ కుమారు , యూ . శ్రీనివాస్, రాకేష్ , వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు