ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు..

ఉల్లిపాయ‌లు అలియాస్ ఉల్లిగడ్డ, ఉల్లి చేసే మేలు తల్లి కుడా చేయదనే సామెత ఉన్నది

ఉల్లిపాయ‌లు వంట‌ల్లోనే కాకుండ వివిధ ర‌కాలుగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవి ఏమిటో ఈ కింద ఏడు పాయింట్స్ చదవండి.

1. పెద్ద‌గా ఉండే ఉల్లిపాయ‌ల‌ను చ‌క్రాల్లా కోసి రాత్రి పూట కాళ్ల కింద పెట్టుకుని సాక్స్ ధ‌రించి నిద్రించాలి. ఉద‌యాన్నే తీసేయాలి. దీంతో మ‌న‌కు ప‌లు ఆరోగ్య‌కర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప్ర‌ధానంగా ఇలా చేయ‌డం వ‌ల్ల కాళ్లు మృదువుగా మారుతాయి. కాళ్ల‌కు ఉండే ప‌గుళ్లు పోతాయి.

2. ర‌క్తం శుద్ధి అవుతుంది. జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలో ఉండే నీరంతా బ‌య‌టికి పోతుంది.

3. ఉల్లిపాయ‌ల‌ను కాళ్ల కింద పెట్టుకోవ‌డ‌మే కాదు, ఆ చ‌క్రాల‌ను వాస‌న చూసిన‌ట్ట‌యితే త‌ల‌నొప్పి ఇట్టే మాయ‌మ‌వుతుంది.

4. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడే గుణాలు ఉల్లిపాయ‌ల‌లో ఉన్నాయి.

5. చ‌ర్మంపై ఉల్లిపాయ చ‌క్రాల‌ను రాస్తుంటే మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి. చ‌ర్మం మృదువుగా మారుతుంది.

6. ఉల్లిపాయ ర‌సాన్ని త‌ల‌కు రాస్తుంటే ఊడిపోయిన వెంట్రుక‌లు కూడా మ‌ళ్లీ పెరుగుతాయి. జుట్టు ఒత్తుగా మారుతుంది. శిరోజాలు కాంతివంతమ‌వుతాయి.

7. ఉల్లిపాయ‌ల‌ను ప‌చ్చిగా తింటుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది.

8. ఉల్లిపాయ‌ల‌ను కట్ చేసి వాటి వాస‌న పీలుస్తుంటే జ‌లుబు కూడా త‌గ్గుముఖం ప‌డుతుంది.

9. బెణుకులు, కండ‌రాల నొప్పుల‌ను ఉల్లిపాయ‌లు త‌గ్గిస్తాయి. ఉల్లిపాయ‌ల‌ను తీసుకుని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. వాటికి చక్కెర‌ను క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాసి బ్యాండేజ్‌తో క‌వ‌ర్ చేయాలి. దీంతో నొప్పి త‌గ్గుతుంది.

10. ఉల్లిపాయ‌ల‌ను మెత్త‌ని పేస్ట్‌లా చేసి నుదుటిపై రాస్తుంటే మైగ్రేన్ త‌ల‌నొప్పి త‌గ్గుతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *