
దేవుడు ఎవరికైనా దేవుడే.. అవమానించేలా ఎవ్వరూ చేసినా తప్పే.. పాకిస్తాన్ లోని కొందరు దుండగులు ఓం గుర్తు ముద్రించిన బూట్లు, చెప్పులను అమ్మడం కలకలం రేగింది. దీనిపై పాకిస్తాన్ లోని హిందూ మండలి మండిపడింది. పాకిస్తాన్ సింధూ ప్రావిన్స్ రాష్ట్రంలో ఈ బూట్ల క్రయవిక్రయాలు జరిగినట్లు మీడియాలో విస్తృతంగా వార్తలు రావడంతో హిందువులు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అక్కడి అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు..
హిందువుల మనోభావాలు దెబ్బతీనేలా బూట్లపై ఓం గుర్తు ముద్రించిన దుండగులపై చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. క్రమంగా భారత్ లో కూడా పాకిస్తాన్ లోని ఈ బూట్ల విక్రయాలపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వీహెచ్పీ, తదితర హిందూ సంస్థలు ఇప్పటికే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.