Breaking News

మనకు పతకాలు వస్తాయా..?

1391798853906.cached

రియో ఒలంపిక్స్ కు సమయమొచ్చింది.. నేటి నుంచి దక్షిణా అమెరికా ఖండంలోని బ్రెజిల్ రాజధాని రియోలో ప్రపంచ క్రీడలు ఒలంపిక్స్ జరగబోతున్నాయి.  అన్ని దేశాలు ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాలు తమతమ క్రీడాకారులను పంపాయి. భారత్ 100 కు పైగా క్రీడాకారులను పంపగా.. రష్యా దాదాపు 250 పైచిలుకు క్రీడాకారుల్ని పంపింది. ఇక తొలిరెండు స్థానాల్లో ఉండే చైనా, అమెరికా దేశాల నుంచి లెక్కకు మించి క్రీడాకారులు పోటీపడుతున్నారు..

ఒలంపిక్ లో తొలి రోజు మహిళ షూటింగ్ పోటీలు జరుగుతాయి. ఈ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో భారత్ నుంచి అపూర్వి చండేలా, అయోనికా పాల్ లు పోటీపడుతున్నారు.  ఇక పురుషుల విభాగంలో జీతురాయ్ పోటీపడుతున్నారు. వీరు ముగ్గురిలో ఎవ్వరు మెరిసినా పథకం గెలిచి తొలి స్వర్ణం సాధించిన దేశంగా భారత్ కీర్తి పతాక దేశవిదేశాల్లో ఎగురుతుంది. అందరూ ఆత్రంగా ఎదురుచూసే ఈ క్రీడాసంగ్రామంలో ఈసారి భారత్ ఎన్ని పథకాలు గెలుస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *