Breaking News

నిర్మల్ జిల్లాకు ఓకే.. సిరిసిల్లకు నో.. ఎందుకంటే..

CVWvS7NUAAAf6rv

సిరిసిల్ల జిల్లా ఆశలు గల్లంతయ్యాయి. కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను జిల్లా చేయాలని కేటీఆర్, ఎంపీ వినోద్ లు ప్రయత్నించి విఫలమయ్యారు. సిరిసిల్ల జిల్లా చేయడానికి అవసరమైన మండలాలు, నియోజకవర్గాల కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిరిసిల్ల జిల్లా చేయడం కష్టమని తేల్చేశాడట.. కరీంనగర్ పక్కనున్న చొప్పదండిని సిరిసిల్ల లో కలపుతామని చెబితే అక్కడ తీవ్ర ఆందోళనలు జరిగాయి. దీంతో బౌగోళికంగా దూరంగా ఉన్న వాటిని కలిపే కన్నా సిరిసిల్లను జిల్లా చేయకపోవడమే ఉత్తమమని అధికారులు తేల్చారు. ఇదేం విషయం కేసీఆర్ కు చెబితే శభాష్ నా కొడుకు నియోజకవర్గమైనా అధికారులు శాస్త్రీయంగా ఆలోచించి నిష్పక్షపాతంగా వ్యవహరించారని ప్రశంసిచారట..

ఇక భారీ వ్యాపారి, కాంట్రాక్టర్ అయిన ఆదిలాబాద్ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్ ను జిల్లా చేయడంలో రాజకీయ కారణాలు చాలా ఉన్నాయి. అక్కడ నిర్మల్ లో అల్లోల ఆస్తులు, భూములు, గట్రా చాలా ఉన్నాయట.. జిల్లా చేస్తే చాలా లాభం కలుగుతుందని కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చాడట.. అంతేకాదు మరో మంత్రి జోగు రామన్న కు కూడా నిర్మల్ లో భారీగా భూములున్నాయి. ఈ నేపథ్యంల ో రాజకీయ కారణాలు, ఒత్తిళ్లతో నిర్మల్ జిల్లా అయ్యింది. సిరిసిల్ల చేజారింది.. ఇదీ అసలు కథ…

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *