Breaking News

కొత్త జిల్లాలు.. కొత్త ఉద్యోగాలు..

RTC

10 జిల్లాల తెలంగాణను 27 జిల్లాలు విభజిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రజల వద్దకు పాలను చేరువ చేయాలనే ఉద్దేశంతో వడివడిగా ముందుకు వెళ్తున్నారు. దసరాకు ఖచ్చితంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో సీఎస్ నేతృత్వంలో ఉన్నతస్థాయి అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. పరిపాలన, పర్యవేక్షణ, ఉద్యోగుల కేటాయింపు సహా పలు బాధ్యతలను వీరు నిర్వర్తించనున్నారు.

ఇక నూతన జిల్లాల అవసరం మేరకు కొత్తగా ఉద్యోగాలు అవసరమని.. అందుకోసం కొత్త నియామకాలు చేపట్టాలని కేసీఆర్ కేబినెట్ మీటింగ్ లో చర్చించారు. ఇందుకోసం శాఖలు, జిల్లాల వారీగా ప్రతిపాదనలివ్వాలని కోరారు. ఒకే పనితీరున్న శాఖలన్నింటిని ఒకే జిల్లా అధికారిని నియమించి అన్ని శాఖల్ని విలీనం చేయాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. జోనల్ విధానం రద్దు చేసిన తర్వాతనే నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. అంటే జిల్లాల విభజన తర్వాత జిల్లా యూనిట్ గా, రాష్ట్రం యూనిట్ గా ఉద్యోగాలను భర్తీ చేయాలని కేసీఆర్ ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *