Breaking News

కొత్త జిల్లాల్లో సిరిసిల్ల, నిర్మల్ లకు నో ఛాన్స్

new-TS-districts

కొత్త జిల్లాల జాబితా చివరకు వచ్చింది. వచ్చేవారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ సీసీఎల్ ఏ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం వచ్చే వారంలో తెలంగాణలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. కేసీఆర్ కొత్త జిల్లాలపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను ఆగస్టు 4 నుంచి 10లోపు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. జారీ చేసిన తర్వాత 30 రోజులు లోపు అభ్యంతరాలు స్వీకరించి కలెక్టర్లు చివరకు ఫైనల్ నివేదికలను ప్రభుత్వానికి సీసీఎల్ ఏకు ఇస్తే జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది దీంతో జిల్లాల ప్రక్రియ పూర్తవుతుంది.
కాగా కొత్త జిల్లాల ఏర్పాటులో నిర్మల్, సిరిసిల్లకు చోటు దక్కలేదు. ముందు ఈ జిల్లాలు ఏర్పాటవుతాయని అనుకున్నా.. రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్లు రావడంతో వీటిని పరిగణలోకి తీసుకోలేదు. ప్రదాని నరేంద్రమోడీ పర్యటన తర్వాత కలెక్టర్లతో భేటి అయ్యి కేసీఆర్ ఈ 13 కొత్త జిల్లాలను ప్రకటిస్తారని సమాచారం.
కొత్త జిల్లాలు 13 ఇవే..: మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యపేట, యాదాద్రి, కొత్తగూడెం, సికింద్రాబాద్ లు కొత్త జిల్లాలుగా ఏర్పడనున్నాయి. అలాగే 74 మండలాలను సైతం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *