నీళ్ల కోసం రెండు రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి..

cauveryissue

నీళ్ల కోసం రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతాయి అని వీరబ్రహ్మం ఎప్పుడో చెప్పాడు.. అదే నిజమవుతోంది.. దక్షిణాన గల ప్రముఖ రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటకలు నీటి కోసం కొట్టుకుంటున్నాయి. తమిళనాడుకు నీటి విడుదలపై కర్ణాటకలో హింస పెచ్చరిల్లింది.. వేరి జలాల సమస్యతో తమిళనాడు, కర్నాటక ల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి బెంగుళూరులోను, మరికొన్ని చోట్ల తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలను దగ్దం చేస్తుంటే, తమిళనాడులో కర్నాటక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలపై దాడులు చేస్తున్నారు.రామేశ్వరం ఆలయం వద్ద పార్కింగ్ ఏరియాలో ఉన్న కర్నాటక వాహనాలను కొందరు ధ్వంసం చేశారు.
కాగా బెంగుళూరులో ఒక యువకుడిపై కొందరు దాడి చేశారు. చెన్నై మైలాపూర్ లో కర్నాటకకు చెందిన వారి హోటల్ పై దాడి చేసి అద్దాలు పగుల కొట్టారు. సుప్రింకోర్టు కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశించిన తర్వాత ఈ గొడవలు పెరిగాయి. దీంతో బెంగుళూరులో స్కూళ్లను మూసివేశారు.తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న వాహానాలను కర్నాటకలోకి రాకుండా నిషేదించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *