నయీం కేసు: ఎమ్మెల్సీలకు కేసీఆర్ షాక్

kcr_land

గ్యాంగ్‌స్ట‌ర్ నయీం ఎన్‌కౌంట‌ర్ త‌ర్వాత తెలంగాణ‌లో అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల్లో చాలామందికి టెన్ష‌న్ ప‌ట్టుకుంది. న‌యీంతో సంబంధాలు ఉన్న‌వారి ప‌ద‌వుల‌కు ఇప్పుడు ఏం ముప్పు వ‌స్తుందో అని వారంతా ఆందోళ‌న‌తో ఉన్నారు. న‌యీంతో సంబంధాలున్న అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల చిట్టాను సీఎం కేసీఆర్ తెప్పించుకున్న‌ట్టు స‌మాచారం. దీంతో వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా కేసీఆర్ భావిస్తున్నార‌ట‌.

ఈ క్ర‌మంలో ఇద్ద‌రు ఎమ్మెల్సీలు న‌యీంతో రాసుకుని, పూసుకుని తిరిగార‌ని, పూర్తిస్థాయిలో అనేక దందాలు చేశార‌ని కేసీఆర్ వ‌ద్ద ఉన్న ఇంటిలిజెన్స్ రిపోర్టులో ఉంద‌ట‌. అయితే ఈ ఇద్ద‌రు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌లోకి రాక‌ముందే న‌యీంతో క‌లిసి దందాలు, సెటిల్‌మెంట్లు చేసిన‌ట్టు స‌మాచారం. దీంతో వీరిపై వేటు వేసి రాజీనామా చేయించాల‌ని నిర్ణ‌యానికి కేసీఆర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

అయితే ఈ ఇద్ద‌రు ఎమ్మెల్సీలు కేసీఆర్‌ను క‌లిసి న‌యీం కేసులో త‌మ‌కు సంబంధం లేద‌ని… తాము అమాయ‌కుల‌మ‌ని, న‌యీంను ఫొటోలో త‌ప్ప లైవ్‌లో ఎప్పుడూ చూడ‌లేద‌ని చెప్పుకున్నార‌ట‌. అయితే అప్ప‌టికే కేసీఆర్ త‌న వ‌ద్ద ఉన్న ఇంటిలిజెన్స్ రిపోర్టును వారికి చూపించ‌డంతో వారు షాక్ అయ్యి …వారికి నోట మాట కూడా రాలేద‌ని టీఆర్ఎస్‌వ‌ర్గాల ఇన్న‌ర్ టాక్‌.

నయీం దందాలో ఉన్న‌ వారెవరైనా పార్టీలో ఉంటే ముందుగా వారిపై కేసులు పెట్టి, ఆ తర్వాత ఇతర పార్టీల నేతలపై చర్యలకు దిగాల‌ని కేసీఆర్ డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం. దీంతోనే ఓ ఎమ్మెల్సీని త్వ‌ర‌లోనే రాజీనామా చేయంచే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *