Breaking News

నాయీంకు నేను ఫోన్ చేయలేదు..

tdpseniorleaderumamadhavreddy-21-1469085986

నల్గోండ జిల్లాకు చేందిన మాజీ మంత్రి ఒకరు నయీం అక్రమాలకు అండగా నిలిచారని పోలిసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమాజీ మంత్రి అరెస్ట్ కు రంగం సిద్దమైనట్లు సమాచారం. ఇటువంటి ఆరోపణల నడుమ అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు.ఎలక్ట్ర్రానిక్ మీడియాలో, పత్రికల్లో వస్తున్న కథనాలను అమె తీవ్రంగా తప్పుబట్టారు. ఎవరిని ఉద్దేశించి ప్రచురిస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె సందేహం వ్యక్తం చేశారు. తన భర్త మాధవరెడ్డి ఏ నేపథ్యంలో చనిపోయారో అందరికీ తెలుసని.. ఆ తర్వాత రాజకీయాల్లో తానెంత సేవ చేశానో తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని ఆమె చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తన భర్త మాధవరెడ్డికి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చెరిపేయడానికి కుట్రపూరితంగా ఆయన పేరును తెరపైకి తీసుకోస్తోందని ఆమె మండిపడ్డారు.  తన ఫోన్ నుంచి నిందితుడు నయీం కు వందల కొద్దీ కాల్స్ వెళ్లాయని పత్రికల్లో రాశారని.. అందులో వాస్తవం లేదని ఆమె తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *