Breaking News

నయీంతో మిలాఖత్.. 35కోట్లు పోగేసుకున్న జర్నలిస్టులు

collage-telugu

గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తో తీగ లాగితే చాలా మంది పెద్ద తలకాయలు పేర్లు బయటపడుతున్నాయి. అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలపై పేర్లపై గోప్యం వహిస్తున్న పోలీసులు… మిగతా వారి గుట్టు మాత్రం రట్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి సమీపంలో రియల్ దందాలో నయీం చేసిన ఆగడాల్లో యాదగిరిగుట్ట జర్నలిస్టులు పాత్ర తేటతెల్లం అయ్యింది..

పవిత్ర జర్నలిస్టు వృత్తి లో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే పాత్రికేయులు, పక్కదారులు పట్టి విచ్చలవిడిగా పోగేసుకుంటున్నారు. ఈ విషయాలు గ్యాంగ్ స్టార్ నయీం ఎన్ కౌంటర్ తరువాత ఒక్కొక్కటి గా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో నే యాదాద్రి జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులు tv5 రిపోర్టర్ నవీన్, t news సుధాకర్, express tv విజయ్ లు, నయీం తో చేతులు కలిపి సుమారు గా 35 కోట్ల వరకు ఆస్థులు కూడబెట్టినట్టుగా తెలుస్తోంది. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *