Breaking News

నయీం నుంచి రేవంత్ కు లైఫ్ ఇచ్చిన కేసీఆర్..

00kcr nayeem

గ్యాంగ్ స్టర్ నయీం నుంచి టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి తృటిలో ప్రాణప్రాయం నుంచి తప్పించుకున్నాడట.. నయీం ముఠా రేవంత్ రెడ్డిని చంపేందుకు కుట్ర పన్నినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.. కొల్లాపూర్ నియోజకవర్గంలోని రేవంత్ ఇంటి ఇదుట నయీం అనుచరులు రెక్కీ కూడా నిర్వహించారని పోలీసులు నిగ్గు తేల్చారు..

కొల్లాపూర్ తదితర ప్రాంతాల్లో నయీం మూఠా పెద్ద ఎత్తున భూములు కొని వెంచర్లు, తదితర నిర్మాణాలకు ప్లాన్ చేయగా రేవంత్ రెడ్డి వాటిని అడ్డుకున్నట్టు సమాచారం. దీంతో దీనిపై అగ్గిమీద గుగ్గిలం అయిన నయీం ఏకంగా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికే వార్నింగ్ ఇచ్చాడట.. దీనిపై రేవంత్ ప్రభుత్వానికి సెక్యూరిటీ పెంచాలని అప్పట్లో కోరాడు కూడా.. ఒకవేళ నయీం కనుక బతికి ఉంటే రేవంత్ ప్రాణాలకు ముప్పు ఏర్పడేదే.. ఇప్పుడు నయీం ఖతం కావడంతో రేవంత్ ఊపిరి పీల్చుకున్నాడు. ఓ రకంగా కేసీఆర్ నయీం ఎన్ కౌంటర్  కు ఆదేశాలిచ్చి రేవంత్కు లైఫ్ ఇచ్చినట్టే అయ్యింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *