Breaking News

నయీంకు సహకరించిన ఆ మాజీ మంత్రి కాంగ్రెస్ లీడరేనా..?

nayeem

రియల్ ఎస్టేట్ రంగంలో కోట్లు కొల్లగొట్టి గ్యాంగ్ స్టర్ గా ఎన్నో మర్డర్ లు చేసిన నయీం వెనుక పెద్ద పెద్ద లీడర్లు, పోలీస్ ఆఫీసర్లు ఉన్నట్టు తేలింది..  నయీంను పావుగా వాడి ఒక మాజీ డీజీ, ఇద్దరు డీఎస్పీలు కొన్నేళ్ల నుంచి దందాలు నిర్వహిస్తూ కోట్లు కొల్లగొట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మాజీ డీజీ సొంత వ్యవహారాలను సైతం నయీంతో చేయించుకున్నారని తేలింది.. నయీంకు ఫోన్ చేసిన వారి లిస్టును పోలీసులు సేకరించి విచారిస్తున్నారు.

ఇక నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఏకంగా నయీంను తన ఇంట్లోనే చాలా రోజులు ఆశ్రయం ఇచ్చారనే విషయం వెలుగుచూసింది.. దీంతో ఆ మాజీ మంత్రి ఎవరనే దానిపై సర్వత్రా చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్గొండ జిల్లాకు చెందిన ఆ మాజీ మంత్రిసైతం ప్రముఖ కాంట్రాక్టర్.. ఎన్నో ప్రాజెక్టులకు టెండర్లు వేసి పూర్తి చేశారు. బడా కాంట్రాక్టర్, రియల్ వ్యాపారం చేస్తున్న సదురు మంత్రి ఇప్పుడు బండారం బయటపడి జైలు కెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *