Breaking News

పిల్లలు ఎదగాలంటే ఇవి వేయాల్సిందే..

800x480_IMAGE49521679

-నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం

ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి 10, ఆగస్టు 10 తేదీల్లో ‘జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం’ చేపడుతోంది. బుధవారం అల్‌బెండజోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందిి*
పిల్లల్లో వాడకమిలా..
1-2 ఏళ్ల వయసు పిల్లలకు సగం మాత్రను పొడి చేసి నీటిలో కలిపి ఇవ్వాలి
2-5 ఏళ్ల వయసు పిల్లలకు పూర్తి మాత్రను పొడి చేసిన నీటిలో కలిపి ఇవ్వాలి
6-19 ఏళ్ల వయసు వారికి పూర్తి మాత్రను నేరుగా మింగించాలి.
ఎప్పుడు మాత్రలు వేయాలంటే..
పాఠశాలల్లో పిల్లలు మధ్యాహ్న భోజనం తిన్నాకనే ఈ మాత్రలు వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ కడుపుతో మాత్రలు వేయకూడదు మాత్రలు వేసుకున్నాక తాగడానికి రక్షిత నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. ఆల్బెండజోల్‌ మాత్రలు వేసుకోవడం వల్ల గతంలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తల్లెత్తలేదు. కాకపోతే ఎక్కువ నులిపురుగులు కలిగిన పిల్లలు వీటిని వేసుకున్నప్పుడు కాస్త కడపులో నొప్పి, వాంతి వచ్చినట్లు భావన, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు.
మాత్రతో ప్రయోజనాలివీ..
రక్తహీనత నియంత్రిస్తుంది
పోషకాకల గ్రాహ్యత మెరుగుపరుస్తుంది
వ్యాధి నిరోధక శక్తి పెంపొదిస్తుంది
ఏకాగ్రత మెరుగుపడుతుంది
పని సామర్థ్యం భేషుగా ఉంటుంది
సంక్రమణ క్రమాన్ని తుంచి వేస్తుంది. నులి పురుగుల సంక్రమణ వ్యాప్తిని నిరోధిస్తుంది.
గుర్తుంచుకోవాల్సిన అంశాలు…
1-19 వయసు కలిగిన పిల్లలందరికీ నులిపురుగుల నిర్మూలన మాత్రలను అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉచితంగా అందజేస్తారు.
నులిపురుగుల నిర్మూలన కాని పిల్లలకు తిరిగి ఫిబ్రవరి 15, ఆగస్టు 17 తేదీల్లో నులి పురుగుల మాత్ర తప్పనిసరిగా వేయాలి
బడికెళ్లని పిల్లలను సైతం గుర్తించి వీటిని ఉచితంగా పంపిణీ చేస్తారు
నులిపురుగుల మాత్ర (ఆల్బెండజోల్‌) పిల్లలకే కాదు పెద్దలకు కూడా సురక్షితమైంది.
నులి పురుగుల సంక్రమణ ఉన్న పిల్లలకు చికిత్స అందించడానికి సులభమైన మార్గం నులి పురుగుల నిర్మూలన మాత్ర మాత్రమే

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *