
ఆయనో ఉద్యమ కెరటం.. బాల్యం నుంచి విప్లవోద్యమాల బాట పట్టాడు. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావుతో కలిసి నక్సలైట్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ స్ఫూర్తిలోనే పెళ్లి చేసుకోకుండా అవివాహితుడిగానే ఉండిపోయారు. అనంతరం కాలంలో ఉద్యమ బాట వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.
నారాదాసు లక్ష్మణరావు(61) 2000 సంవత్సరంలో టీఆర్ఎస్ లో చేరి నాయకుడిగా ఎదిగారు. రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం శాసనమండలిలో టీఆర్ఎస్ లో సీనియర్ గా కొనసాగుతున్నారు.
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో నారదాసు విస్తృతంగా పాల్గొన్నారు. అక్కడే పరిచయమైన హైదరాబాద్ నారాయణ గూడకు చెందిన హైకోర్టు న్యాయవాది అక్కి వర్ష(41)తో సాన్నిహిత్యం పెరిగింది. వారి మనుసులు కలవడంతో వివాహం చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ జనవరిలో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. దీంతో ఇంత లేటు వయసులో నారదాసు పెళ్లి బాజా మోగనుందన్నమాట..