
వైవిధ్యభరిత చిత్రాలతో జనాల్ని రంజింప చేస్తూ హిట్ కొడుతున్న నాని ఈసారి మరో ప్రేమకథతో మనముందుకు వస్తున్నారు. నేను శైలజ హీరోయిన్ కీర్తి సురేశ్ తో జత కట్టి నాని హీరోగా రూపొందుతున్న చిత్రం ‘నేను పక్కా లోకల్.’ ఈ మూవీని వెంకటేశ్వర పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు..నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రిస్టమస్ కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు.