వేంకటేశ్వరా.. కరుణించు తండ్రి..

సూపర్ లాంటి సినిమాలో లవర్ బాయ్ లా.. కనిపించాలన్నా.. అన్నమయ్యలో భక్తి పారవశ్యం ఉప్పొంగచేయాలన్న అది నాగార్జునే చెల్లు .. అదే ఇప్పుడు రుజువైంది.. నాగార్జున కథానాయకుడిగా నటించిన ఓం నమో వేంకటేశాయా మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ వేడుకకు నాగార్జున కుమారులు అఖిల్, నాగచైతన్య అతిథులుగా హాజరై ఒక ఆడియో సీడీని, మరొకరు టీజర్ ను విడుదల చేశారు..
ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ నాగార్జున హాథీరామ్ బాబా పాత్రలో ఒదిగిపోయారని.. ప్రేక్షకులకు దేవుడి దర్శనం కావాలంటే నాగార్జున కళ్లతో చూడాలని చెప్పారు. అంతలా భక్తుడి పాత్రలో లీనమైన నటుడిని తాను చూడలేదని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన నాగార్జున ఓ సంచలన విషయాన్ని భయటపెట్టాడు.. ఓం నమో వేంకటేశాయ మూవీ తీస్తున్నప్పుడు రాఘవేంద్రరావు తరచూ తనతో ఓ మాట అనేవారని.. తనకు ఈ సినిమాయే లాస్ట్ చిత్రం కావచ్చేమోనని సందేహపడేవారన్నారు.. కానీ తాను దాన్ని వారించి ఆ మాట అబద్ధం కావాలని కోరుకుంటున్నట్టు నాగార్జున చెప్పాడు.. వేంకటేశ్వర స్వామిని సైతం ఇదే కోరుకుంటున్నానని తెలిపారు.  భక్తిరస చిత్రాల్లో తాను నటించడం తన పూర్వజన్మ సకృతం అని నాగ్ ఆనందం వ్యక్తం చేశారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *