
బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లా సరిహద్దుల్లో ని అటవీ ప్రాంతంలో నక్సల్స్ రెచ్చిపోయారు. రహదారిపై మందుపాతర పేల్చడంతో పదిమంది సీఆర్పీఎఫ్ కమాండోలు ప్రయాణిస్తున్న వ్యాన్ పేలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 10మంది ప్రాణాలు కోల్పోయారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
చకరబంద-దుమరినాల అడవుల్లో ఈ పెను ఘర్షణ జరిగింది. అంతకుముందు జవాన్ల కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు హతమయ్యారు. కొద్దిరోజులుగా ఈ ప్రాంతం నక్సల్స్ కోసం కూంబింగ్ కొనసాగుతోంది. సీఆర్పీఎఫ్ బెటాలియన్ కమాండోలు ఈ ప్రాంతాన్ని జల్లడ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కమాండోలు ప్రయాణిస్తున్న వాహనాన్ని నక్సల్స్ గమనించి పేల్చివేశారు.