హామీ ఇచ్చి మోసం చేస్తున్న కేసీఆర్ : నగునూరి శేఖర్

జర్నలిస్టుల సంక్షేమంపై ఎన్నికల్లో హామీ ఇచ్చి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొని అమలు చేయకుండా సీఎం కేసీఆర్ మోసం చేశాడని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అద్యక్షులు నగునూరి శేఖర్ ఆరోపించారు.. కరీంనగర్ లోని కలెక్టరేట్ ఎదుట టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా, వంటావార్పు చలో కలెక్టరేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వేలాది మంది జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వకుండా జాప్యం చేసిందన్నారు. హెల్త్ కార్డులు చిత్తు కాగితాలయ్యాయని.. దీంతో దాదాపు 350కి పైగా జర్నలిస్టులు చనిపోయారని.. ఆర్థికంగా జర్నలిస్టులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రిడిటేషన్ల కార్డులపై కూడా కేసీఆర్ రెండున్నరేళ్లు గడిచినా ఇంకా ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికీ జిల్లాల్లో ఆంధ్ర ప్రభుత్వం జారీ చేసిన అక్రిడిటేషన్లే ఉన్నాయని ఆయన ఆరోపించారు. వెంటనే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, కరీంనగర్ జిల్లా అద్యక్షులు తాడూరి కరుణాకార్, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ టోమ్జా రాష్ట్ర అద్యక్షులు అయిలు రమేశ్ , జిల్లా కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్మూరి విజయసింహారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిట్లల రాజేందర్, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎలగందుల రవీందర్, సురేంద్రకుమార్, లాయక్ పాషా, కే. భద్రాచలం, ప్రభుదాసు, విజయేందర్ రెడ్డి, వంశీ, జగన్మోహన్, కొండా లక్ష్మన్, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, వందలాది మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.
కాగా ఈ ధర్నాలో ప్రజాప్రతినిధులు చాడ వెంకట్ రెడ్డి, కటకం మృత్యుంజయం, పొన్నం ప్రభాకర్, విజయరమణరావు, బండి సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బీజేపీ జాతీయ నాయకుడు సుగుణాకర్ రావు, గందె మాధవి, సుజాతరెడ్డి, ఆకుల ప్రకాష్, సుదర్శన్, కొరివి వేణుగోపాల్, పీవీ సూర్యం, పాల్గొని ప్రసంగిస్తూ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నగునూరి శేఖర్ జర్నలిస్టుల ఆందోళనలో మాట్లాడిన వీడియోను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *