Breaking News

ధోని.. అనామకుడి నుంచి అగ్రశ్రేణి ఆటగాడిగా..

maxresdefault

మహేంద్ర సింగ్ ధోని.. అత్యంత పేద మధ్యతరగతి కుటుంబం నుంచి దేశానికే ప్రాతినిధ్యం వహించి క్రికెట్ లో భారత్ క్రికెట్ వెలుగురేఖగా మారిన గొప్ప క్రికెటర్.. అతడి జీవితమే అందరికీ స్ఫూర్తి దాయకం.. కనీసం క్రికెట్ ఆడడానికి కూడా వసతులు, డబ్బులు లేని స్థితిలో ధోని స్కూల్ కోచ్ అతడిని ఫుట్ బాల్ ఆడుతుండగా క్రికెట్ ఆడమని సలహా ఇస్తాడు. అక్కడి నుంచి లభించిన ప్రోత్సాహంతో ధోని అంచలంచెలుగా ఎదిగిన తీరును ఇప్పుడు కథగా మలిచారు.

ధోని జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ సినిమా పేరు కూడా ‘ఎంఎస్ ధోని’. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ధోని పాత్రలో జీవించారు. ఈ సందర్బంగా చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ లో ఒక క్రికెటర్ పై వచ్చిన ఈ తొలిసినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది. ధోని జీవిత చరిత్రను కళ్లకు కట్టిన ఈ ట్రైలర్ ను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *