MPLADS కింద పార్లమెంటు సభ్యులు సిఫారసు చేసే పనులు త్వరగా పూర్తి చేయాలి

resized_ARK_2870

పార్లమెంటు సభ్యుల స్ధానిక ప్రాంతాల అభివృద్ధి నిధుల పథకం (MPLADS) క్రింద పార్లమెంటు సభ్యులు సిఫారసు చేసే పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ కోరారు. మంగళవారం సచివాలయంలో ఎంపీలాడ్స్ రాష్ట్ర స్ధాయి మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ బండారు దత్తాత్రేయ, శ్రీ కె.కేశవరావు, శ్రీ జితేందర్ రెడ్డి, శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శ్రీ కె.విశ్వేశ్వర్ రెడ్డి, శ్రీ కెప్టేన్ లక్ష్మీకాంతారావు, శ్రీ మల్లారెడ్డి లతో పాటు ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ బి.పి ఆచార్య, ఆర్ అండ్ బి ముఖ్యకార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, పంచాయితీ రాజ్ ముఖ్యకార్యదర్శి శ్రీ వికాస్ రాజ్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీ నవీన్ మిత్తల్ లతో పాటు ప్రణాళికా శాఖ అధికారులు పాల్గొన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు మంచి సలహాలిచ్చారని, వారి సూచనల ఆదారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఎంపీలాడ్స్ పథకం ద్వారా మంజూరైన పనుల పూర్తికి ప్రత్యేక చర్యలతో పాటు జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ లో అజెండాలో ప్రత్యేకంగా సమీక్షిస్తామని సి.ఎస్. తెలిపారు. ప్రజలకు ఎంతో మేలు చేసే పనులు పూర్తయితే వారి జీవితాలలో ఎంతో మార్పు వస్తుందని అన్నారు. ఎంపీలాడ్స్ ద్వారా మంజూరైన వాటిలో పనుల వారిగా సమీక్షించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తామన్నారు. వచ్చే ఆరు నెలల్లో మంచి పురోగతిని సాధిస్తామన్నారు. జిహెచ్ఎంసి ఏరియాలో చేపట్టే పనులకు సంబంధించి మంజూరు ప్రక్రియలో తగు మార్పుల కోసం ప్రత్యేకంగా సమావేశమవుతామన్నారు. జిల్లా స్ధాయిలో దిశా సమావేశాలను మూడు నెలలకొకసారి నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తామని అన్నారు. ప్రొటోకాల్ కు సంబంధించి నిబంధనల ప్రకారం అమలు అయ్యేలా చూస్తామన్నారు. క్షేత్ర స్ధాయిలో పనులు పూర్తయ్యేలా చూస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీలాడ్స్ మార్గదర్శకాలపై ప్రణాళికా శాఖ తెలుగులో అనువదించిన పుస్తకాన్ని సి.ఎస్ ఆవిష్కరించారు.
ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ బి.పి ఆచార్య మాట్లాడుతూ 17 మంది పార్లమెంటు సభ్యులు, 10 మంది రాజ్య సభ సభ్యులు, 15 నోడల్ జిల్లాలు తెలంగాణలో ఉన్నాయని, ప్రతి సభ్యునికి సంవత్సారానికి 5 కోట్లు రెండు విడతలుగా జారీ అవుతాయని పార్లమెంటు సభ్యులకు వివరించారు. ప్రతి సంవత్సరం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం వారి ఏరియాలకు ఖర్చు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 న దీనిని తప్పని సరిచేస్తూ ఆదేశాలిచ్చారని తెలిపారు. ఎంపీలాడ్స్ పనులను వెబ్ సైట్ ద్వారా పర్యవేక్షిస్తారన్నారు.లోక్ సభ సభ్యులకు సంబంధించి మొత్తం నిధులు 172.50 రాగా ఎస్సీ లకోసం 33.70 కోట్లు (19.58%),ఎస్టీల కోసం 25.33 కోట్లు (15.51%) రాజ్యసభ సభ్యులకు సంబంధించి 135 కోట్లు రాగా ఎస్సీ లకు 22.66 కోట్లు (16.79% ) ఎస్టీలకు 15.73 కోట్లు (11.65%) మేర పనులు మంజూరు అయ్యాయని అన్నారు.
ఎంపీలాడ్స్ పనులు మంజూరయ్యాక సంవత్సరంలోగా పూర్తవ్వాలని తెలుపుతూ పార్లమెంటు సభ్యుల వారిగా అందిన నిధుల వివరాలు తెలిపారు. నిధుల ఖర్చులో వివిధ జిల్లాలు సాధించిన ప్రగతిని వివరించారు. లోక్ సభ సభ్యులకు సంబంధించి 8941 పనులు మంజూరు కాగ 6322 పూర్తయ్యాని, 1211 పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. 253 కోట్ల విలువ గల పనులు మంజూరు కాగ 166 కోట్ల విలువ పనులు పూర్తయ్యాయని 46 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
రాజ్య సభ సభ్యులకు సంబంధించి 3968 పనులు మంజూరు కాగ 2902 పూర్తయ్యాయని, 791 పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. 140 కోట్ల విలువ గల పనులు మంజూరు కాగ 95.29 కోట్ల విలువ పనులు పూర్తయ్యాయని 35 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఎంపీలాడ్స్ పనులు కోసం 15 నోడల్ జిల్లాలో ఫెసిలిటేషన్ సెంటర్లు ప్రారంభించామన్నారు.
ఎంపీలాడ్స్ కు సంబంధించి పనుల పూర్తికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని నిర్ణీత కాలపరిమితిలో పూర్తిచేయాలని, జిల్లా కలెక్టర్లు ప్రత్యక్షంగా సమీక్షించేలా చూడాలని పార్లమెంట్ సభ్యులు కోరారు. జిహెచ్ఎంసి పనులకు సంబంధించి మంజూరు ప్రక్రియను సరళీకృతం చేయాలన్నారు.వివిధ పనులకు నిధులిచ్చిన పార్లమెంట్ సభ్యుల శిలాఫలకాలు ఉండాలన్నారు.వివిధ శాఖలలో చేపడుతున్న పనులపై శాఖాధిపతులు వర్కింగ్ ఏజెన్సీలతో ప్రత్యేకంగా సమీక్షీంచాలని కోరారు. ఉపాధి హామి పనుల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇటువంటి సమావేశాన్ని రెగ్యులర్ గా నిర్వహించాలని కోరారు. ప్రొటోకాల్ సమస్యలు రాకుండా చూడాలన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *