ఘనంగా ఎంపీ వినోద్ జన్మదిన వేడుకలు

కరీంనగర్‌ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన వేడుకలను ఢిల్లీలోని తెలంగాణ భావన్ లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్ వెనక ఉన్న మదర్సలో ముస్లిం మతా గురువు ఇమమ్ గారు ప్రార్ధనలు చేసి ఎంపి వినోద్ కుమార్ గారు కరీంనగర్‌ జిల్లా అభివృద్ధిని వేగంగా చేస్తున్నారని వారికి భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్ధించారు. మదర్సలో చదువుకునే పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే తెలంగాణ భవన్‌లో ఉన్నటువంటి శ్రీ వేంకటేశ్వర దేవాలయములో ఎంపి శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి పేరు మీద అర్చన చేయించారు. వారికి దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కరీంనగర్‌ అభివృద్ధి కోసం ఢిల్లీ స్థాయిలో ఎంపి విశేష కృషి చేస్తున్నారని ముఖ్యంగా కరీంనగర్‌ నగరాన్ని స్మార్ట్ సిటిలో చేర్చడం అలాగే కరీంనగర్‌ జిల్లాకు జాతీయ రహదారులతో అనుసంధానం చేయడం జిల్లాను అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. అనంతరం ఎంపి కుమారుడు ప్రనిత్ తో జన్మదిన కేక్ ను తెలంగాణ భవన్ లో కాట్ చేయించారు. ఈ కార్యక్రమంలో zptc లు సిద్దం వేణు, ఉలెంగుల ఎకానందం, రాష్ట్ర నాయకులు మైకెల్ శ్రీనివాస్, అక్బర్ హుసేన్‌, జిల్లా నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, దండబోయిన రాము, ఏనుగు రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *