ఇక నమస్తే, టీన్యూస్, తెలంగాణ టుడేలకు కవితనే ఎండీ

kavitha

ఇన్నాళ్లు  వేరే వాళ్ల పర్యవేక్షణలో మద్దతుగా నిలుస్తున్న నమస్తే తెలంగాణ పత్రిక, టీన్యూస్ లను టీఆర్ఎస్ పార్టీ టేక్ వర్ చేసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. ఈ మేరకు పనులు కూడా ప్రారంభించినట్టు తెలిసింది.. ప్రస్తుతం కేసీఆర్ కు సన్నిహితుడైన పారిశ్రామిక వేత్త నమస్తే తెలంగాణ పత్రిక ఎండీగా కొనసాగుతున్నారు. అలాగే టీ న్యూస్ కూడా కేసీఆర్ సన్నిహితులే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని స్వాధీనం చేసుకొని ఎంపీ , కేసీఆర్ కూతురు కవిత ఎండీగా నడిపించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది.

అలాగే హైదరాబాద్ తో పాటు దేశ వ్యాప్తంగా జాతీయ స్థాయిలోకి ప్రచారం వెళ్లేందుకు వీలుగా త్వరలోనే తెలంగాణ టుడే పేరుతో ఆంగ్ల పత్రికను టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు దీనిలో చేరేందుకు ది హిందూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా ల నుంచి సీనియర్ పాత్రికేయులను టీఆర్ఎస్ సంప్రదించి వారికి జీతాలు ఆఫర్ చేసిందట.. సో ఇప్పుడు నమస్తే, టీ న్యూస్ తో పాటు తెలంగాణ టుడే పత్రికలను ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి వాటన్నంటికి కవితను ఎండీగా పెట్టి నడిపించాలని కేసీఆర్ ప్లాన్ చేశారని సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *