
భారత సినీ చరిత్రలో బాహుబలి మూవీ ఓ సంచలనం.. అదీ విడుదలై దేశ, విదేశాల్లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే.. బాహుబలిని మించిపోయేలా రూపొందింది మొహంజదారో చిత్రం. ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టిస్తోంది.. అద్భుతంగా ట్రైలర్ ఉంది. ఇప్పటికే విడుదలైన ఒక్కరోజులోనే 11లక్షల మంది చూశారు..
కాగా ఇప్పుడు హృతిక్ రోషన్ హీరోగా భారత చరిత్రాక ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మొహంజదారో’. ఈ మూవీ భారత ఉపఖండంలో తొలి నగరమైన మొహంజదారో చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. మానవ నాగరికతకు పునాదిగా మొహంజదారో నాగరికతను కథ వెల్లడించనుంది.
ఈ సినిమాలో హీరోగా హృతిక్ రోషన్ నటించారు. లగాన్, జోథా అక్బర్ లాంటీ మూవీలకు దర్శకత్వం వహించిన అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలో రిలీజ్ కాబోతోంది..
‘మొహంజదారో’ ట్రైలర్ ను పైన చూడొచ్చు..