
తెలుగు రాష్ట్రాలలో మీడియా లేనిదే రాజకీయాలు లేవు.. మీడియానే అధికారంలోకి రావడానికి సహకరిస్తుంది.. దించేలా చేస్తుంది.. నాటి ఎన్టీఆర్ నుంచి మొదలుకొని నేటి చంద్రబాబు దాకా మీడియా మేనేజ్ మెంట్ ను సరిగ్గా వాడుకుంటూ గద్దెనెక్కిన వారే.. అలా కొనసాగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు.. ఇవి టీడీపీకి సపోర్ట్ చేస్తుండగా.. వైసీపీ , ఒకప్పుడు కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా నిలిచింది సాక్షి పత్రిక.. ఇలా మీడియా తెలుగు రాజకీయాలను శాసిస్తూనే ఉంది..
కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు కమ్మలైన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతోపాటు ఈనాడు అధిపతి రామోజీరావులను గ్రిప్ లో పెట్టుకొని రాజకీయంగా ఎదురులేకుండా ఉన్నారు. ఈ కమ్మ, కాపు, రెడ్డి రాజకీయాలే ప్రస్తుతం బలంగా ఉన్నాయి. దీనిపై మోహన్ బాబును ప్రశ్నించిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు అదిరిపోయేలా సమాధానమిచ్చారు మోహన్ బాబు.. మోహన్ బాబుతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రొగ్రాంలో రెడ్డిలతో సంబంధం కలుపుకున్నావని మోహన్ బాబును ప్రశ్నించిన ఆర్కే కు అదిరిపోయేలా సమాధానమిచ్చారు డైలాగ్ కింగ్.. మోహన్ బాబు పంచ్ డైలాగులకు రాధాకృష్ణ సైలెంట్ అవ్వడం ఆయన వంతైంది..
మోహన్ బాబు రాధాకృష్ణను ఇరుకున పెట్టిన వీడియోను పైన చూడొచ్చు..