
దేశాన్ని ఏలుతున్న మోడీ తల్లికి అంత గతి పట్టడం నిజంగా దేశానికే అవమాన కరం.. మోడీ కనుసైగ చేస్తే చాలు ఏదైనా జరిగే ఈ దేశంలో ఆయన తల్లికి 4 వేల నోట్ల మార్పిడి కోసం అష్టకష్టాలు పడడం దేనికి సంకేతం అనే ప్రశ్న ఉదయిస్తోంది.. ఇది పబ్లిసిటీ స్టంటేమో అన్న అనుమానం అందరిలోనూ కలుగుతోంది..
మోడీకి గుజరాత్ లో చాలా పాపులారిటీ ఉంది. సీఎంనుంచి కార్యకర్తల వరకు అందరూ మోడీని బంటులే.. మోడీ అన్నాదమ్ములు సైతం అహ్మదాబాద్ లో తల్లి చెంతనే ఉంటున్నారు. అలాంటప్పుడు 100 ఏళ్లకు దగ్గరవుతున్న పండు ముదసలి మోడీ అమ్మ అలా క్యూ లైన్లలో నిలుచొని గంట సేపు ఆప సోపాలు పడుతుంటే మోడీ మందీ మార్బలం అంతా ఏమైనట్టు అనే ప్రశ్న ఉదయిస్తోంది.. సీఎం వచ్చి మరీ మోడీకి సేవలు చేసే స్టామినా ఉండి కూడా మోడీ ఇలా తన తల్లిని బ్యాంకు ముందు పడిగాపులు కాయిచ్చాడంటే అది పబ్లిసిటీ కోసమేనని అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.