మోడీజీ జర మారండి..

102984523-narendra_modi.1910x1000

కార్పొరేట్లకు దోచుపెట్టడం.. కార్మికులను తగ్గించడం.. వారి పొట్ట కొట్టడం.. ప్రైవేటుకు ప్రభుత్వ సంస్థలను ధారదత్తం చేయడం ఇవే మోడీ దేశంలో ప్రధాని అయ్యాక చేసిన మార్పులు.. మార్చేస్తానంటూ వచ్చిన మోడీ.. చివరకు కార్మిక కంఠక విధానాలతో వారి ఆగ్రహానికి గురయ్యాడు. నిన్న దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బంద్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ దెబ్బకు మోడీ బీజేపీ ఠారెత్తిపోయింది. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులు సమ్మె చేస్తుండడంతో దాని ప్రబావం వివిధ రాష్ట్రాలపై పడింది.

ఎపి, తెలంగాణలలో కూడా సమ్మె ప్రబావం కనిపించింది. ముఖ్యంగా ఆర్టీసి బస్ లు తిరగడం లేదు. బస్ లన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. ఆర్టిసీ కార్మికులంతా విధులు బహిష్కరించడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడ్డారు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్,ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో సింగరేణి కార్మికులు కూడా సమ్మె విజయవంతం అయ్యింది.  .ఫలితంగా నలభై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటకం కలిగింది.దీని వల్ల సుమారు పది కోట్ల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.ఎపిలో కొంత తక్కువ ప్రభావం ఉంది .కర్నూలులో ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె చేయగా, మజ్దూర్ యూనియన్ కార్మికులు నిరసన బాడ్జీలు పెట్టుకుని విధులకు హాజరవుతున్నారు. కడప జిల్లాలో బస్ యథావిధిగా తిరుగుతున్నాయి. ఇపిఎఫ్ తదితర అంశాలలో కేంద్రం కార్మిక వ్యతిరేక వైఖరితో ఉందని ఈ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఇప్పటికైనా మోడీ కార్మిక శ్రేయస్సు కోసం మంచి నిర్ణయాలు తీసుకొని ప్రైవేటు పరం చేయకుండా వేజ్ బోర్డు, కార్మిక హక్కులు కాపాడాలని కార్మికులు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *