విదేశాల్లో ఎక్కువ.. దేశంలో తక్కువ

ప్రధాని నరేంద్రమోడీ రూటే సపరేటు.. ఆయన ప్రసంగాల్లో కనిపించిన వేడి.. చేతల్లో అగుపించడం లేదు.. గుజరాత్ ముఖ్యమంత్రిగా చూపిన తెగువ, ధైర్యం ఇప్పుడు దేశ ప్రధానిగా కనిపించడం లేదు.. అసలు మోడీకేమైందీ అని చాలాసార్లు.. చాలామంది అనుకుంటున్నారు.. ఏమైందో ఆయనకే ఎరుక..
ఆ మధ్య సీనియర్ కేంద్రమంత్రులు వెంకయ్య, అరుణ్ జైట్లీలు ప్రధాని మోడీ పర్యటనలు ఎక్కువవుతున్నాయని పరోక్షంగా చర్చించుకున్నారట.. ప్రధాని మోడీ వీసా తీసుకొని భారత్ లో కొద్దికాలమే ఉంటున్నారని.. విదేశాలకే ఎక్కువ చెక్కేస్తున్నారని ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయని.. మోడీ విదేశీ పర్యటనలు తగ్గించుకుంటే మంచిందని ఆఫ్ ది రికార్డు మాట్లాడుకున్నారట.. కానీ మోడీ ముందు మోడీ తో అనే ధైర్యం లేదు కాబట్టి మిన్నకున్నారట..
సో సొంత పార్టీ బీజేపీలోనే మోడీ విదేశీ పర్యటనలపై వ్యతిరేకత ఉంది. ఇక ప్రతిపక్షాలు మోడీని విదేశీయుడు.. భారత్ లో పర్యటిస్తున్నాడు అని విమర్శించకుండా ఉంటాయి.. ఇప్పుడు అదే జరుగుతోంది…
ప్రధాని నరేంద్రమోడీ మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నాడు. మొన్ననే ఐర్లాండ్, ఫ్రాన్స్, అమెరికా దేశాలకు, తదనంతరం దక్షిణకొరియా వెళ్లిన ప్రధాని ఇప్పుడు ఆఫ్రికా పర్యటనకు వెళుతున్నారు..7 నుంచి మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యాలను సందర్శిస్తారు. ఏర్పాట్లు పూర్తయ్యాయి. బహుశా మోడీ తన 5 ఏళ్ల పాలన ముగిసేవరకు ప్రపంచంలోని 196 దేశాలను చుట్టివచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు..

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *