మోడీ.. ప్లానింగ్ చేసేది ఇలానే..

modiswamy

ప్రధాని నరేంద్రమోడీ పై సొంత పార్టీనేతనే విమర్శలు గుప్పించారు. దేశాన్ని కుదిపేసే నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజల బాగోగులు అర్థం కావా అని ప్రశ్నించారు. హంగ్ కాంగ్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలో నల్లధనం అరికట్టడం సమంజసమే అయినా కొత్త నోట్ల జారీ ప్రక్రియలో పేలవమైన ప్రణాళిక, అమలు కారణంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేలవమైన ప్రణాళికతో తీసుకున్న ఆర్థిక శాఖ చర్య దేశాన్ని అయోమయంలోకి నెట్టివేసిందన్నారు. ఆకస్మిక చర్యలతో దేశప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని.. ఇది క్షమించరాని విషయమన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *