Breaking News

లక్ష కోట్లు వద్దు.. మీ ప్రేమే చాలు..

df433e4270f9e70f19ff436ef039b190

‘మోడీజీ తెలంగాణకు లక్ష కోట్లు వద్దు.. కేవలం మీ ప్రేమ చాలు’ అంటూ కేసీఆర్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణలోని మెదక్ జిల్లా గజ్వేల్ లో వివిధ పథకాల ఓపెనింగ్ కు వచ్చిన ప్రధాని మోడీ శంకుస్థాపనల అనంతరం బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.. ఈ సందర్భంగా హిందీలో మాట్లాడి కేసీఆర్ ప్రధాని, కేంద్ర మంత్రులను వేయినోళ్ల పొగిడారు.. కేంద్ర మంత్రులను, మోడీ పనితీరును మెచ్చుకున్నారు. తన రాజకీయ జీవితంలో అవినీతి రహిత కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడే చేస్తున్నానని కేసీఆర్ పేర్కొనడంపై మోడీ ఫిదా అయ్యారు..

ఇక కేసీఆర్ చాలా తెలివిగా వివిధ అభివృద్ధి పథకాలను ప్రస్తావిస్తూనే మా కు కేంద్రం నుంచి లక్ష కోట్ల నిధులు వద్దు కేవలం కేంద్రం నుంచి అడ కావాలి అంటూ మోడీని కట్టిపడేశారు. అలాగే తన రాజకీయ జీవితంలో అవినీతి రహిత కేంద్ర పాలనను ఇప్పుడే ప్రత్యక్షంగా చూస్తున్నాను. దీనికి మోడీయే కారనం.. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా దేశప్రజలు గుర్తిస్తున్నారు’ అంటూ మోడీ పాలనను కేసీఆర్ ఆకాశానికెత్తేశారు.. ఇలా కేసీఆర్ మాట్లాడుతున్నంత సేపు మోడీ చాలా శ్రద్దగా వింటూ కేసీఆర్ మాటలకు ఫిదా అయ్యాడు.. ముఖ్యంగా నిధులు వద్దు మీ కరుణ చాలు అన్న డైలాగ్ అయితే మోడీని మెస్మరైజ్ చేసిందనడంలో అతిశయోక్తి కాదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *