Breaking News

మోడీ ఆశల మూట విప్పుతాడా..?

kcr-modi

నీతి అయోగ్ సభ్యులు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నమిషన్ భగీరథ, కాకతీయ పథకాలను వేయినోళ్ల పొగిడారు. ఇప్పటికే మిషన్ భగీరథ పథకాన్ని ఉద్దేశాన్ని ప్రణాళికలను తమకూ ఇవ్వాలని, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ సహా చాలా రాష్ట్రాలు కోరాయని.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ పథకంపై దేశ వ్యాప్తంగా అందరి దృష్టి నెలకొని ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలంగాణ అధికారులతో అన్నారు..కాగా టీ ప్రభుత్వ అధికారులు సైతం ఈ రెండు పథకాలకు దాదాపు 25 వేల కోట్ల సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. భగీరథకు 20 వేల కోట్లు, కాకతీయకు 5వేల కోట్ల సాయం చేయాలని అభ్యర్థించారు. దేశంలోనే ప్రతిష్టాత్మక మైన ఈ పథకాలను 3ఏళ్లలో పూర్తిచేసి ప్రజలకు సాగు, తాగునీరందస్తామని అధికారులు వివరించారు.

మోడీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ అధికారులు ప్రధానికి, పీఎంవో , కేంద్రానికి పలు నివేదికలు పంపారు. మిషన్ భగీరథను ప్రారంభించనున్న మోడీ ఈ పథకానికి నిధులు విడుదల చేస్తారని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ సందర్భంగా పలు నివేదికలను అధికారులు సిద్దం చేశారు. మోడీ కనీసం ఒక్క పథకానికైనా సాయం చేస్తారని తెలంగాణ ఆశగా చూస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *