Breaking News

మోడీకి అసాధారణ భద్రత

modi -kcr

ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనకు అసాధారణ భద్రత చర్యలు చేపట్టారు.  ఈ సందర్భంగా ప్రధాని బేగంపేటలో అడుగుపెట్టినప్పుడు అక్కడ కొంతమంది నాయకులకు మాత్రమే అవకాశం కల్పించారు. టీఆర్ఎస్ మంత్రులు, బీజేపీ నాయకులకు మాత్రమే స్వాగతానికి అనుమతించారు. ఇక హెలిక్యాప్టర్ లో గజ్వేల్ కు వచ్చిన మోడీతో పాటు కేసీఆర్, గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రులు వెంకయ్య, పీయూష్ గోయల్, అనంత్ తదితరులు మాత్రమే ప్రయాణించారు.

ఇటు హైదరాబాద్ లో, అటు గజ్వేల్ లో ప్రధాని కోసం టైట్ సెక్యూరిటీ పెట్టారు. ప్రధాని నరేంద్రమోడీ గజ్వేల్ కు చేరుకోగానే మొదట మిషన్ భగీరథ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్,  సింగరేణి పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం,  ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ కు శంకుస్థాపన, కాళోజీ యూనివర్సిటీకీ పునాదిరాయి, అలాగే రామగుండం ఎరువుల కర్మాగారాలను రిమోట్ ద్వారా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహిస్తారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *