Breaking News

5 ముఖ్య పథకాలకు నేడు మోడీ శంకుస్థాపన

Narendra-Modi-Telangana-Visit-Expense-Modi-Telangana-Tour-Expense

తెలంగాణ లో తొలిసారి ప్రధాని నరేంద్రమోడీ పర్యటిస్తున్నారు.. ప్రతిష్టాత్మక మిషన్ భగీరథతో పాటు హైదరాబాద్ -కొత్తపల్లి రైల్వే లైన్, సింగరేణి నిర్మించిన జైపూర్ విద్యుత్ ప్లాంట్, ఎన్టీపీసీ నిర్మించే 1600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ , అలాగే కాళోజీ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన, రామగుండంలోని ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరణను మోడీ ప్రారంభించనున్నారు.

ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అనంతరం అక్కడి నుంచి మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండలో మిషన్ భగీరథను ప్రారంభిస్తారు. అనంతరం మిగతా పథకాలకు రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగిస్తారు.

ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాలు మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మహేందర్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ సహా కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, పీయూష్ గోయల్, సురేష్ ప్రభు, వెంకయ్య నాయుడు, అనంత్ కుమార్ లు పాల్గొంటారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *