
సీఎం కేసీఆర్ హైకోర్టు విభజనకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.. దీనికోసం ఢిల్లీలో సీఎంల మీటింగ్ కు వెళ్లిన కేసీఆర్ ప్రధాని మోడీని కలిసి ప్రధానంగా హైకోర్టును విభజించాలని కోరారున. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు మా ఆత్మ గౌరవానికి ప్రతీక అని.. ఏపీలో భవనం నిర్మించే వరకు హైదరాబాద్ లో మరోచోట మంచి వసతులు కల్పిస్తామని.. ఎలాగైనా తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కేసీఆర్ మోడీని కోరారు.
కావాలంటే ప్రస్తుతమున్న హైకోర్టు ఏపీ కి ఇవ్వడానికి కూడా రెడీ అని కేసీఆర్ మోడీని కోరారట.. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు , న్యాయమూర్తుల నియామకాల్లో ఆంధ్రా వారి పాగాపై ఇప్పటికే తెలంగాణ జడ్జీలందరూ ఆందోళన బాటపట్టారని.. వారిని సస్పెన్షన్ కూడా చేశారని తెలిపారు. ఆందోళనలు ఉదృతంగా సాగుతున్నాయని.. వెంటనే హైకోర్టు విభజించి తెలంగాణకు కొత్త హైకోర్టు ఏర్పాటు చేయాలని మోడీని కోరారు.
అలాగే మిషన్ భగీరథ, కాకతీయలకు నిధులివ్వాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ అనంతరం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, ఉమాభారతిలను కూడా కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించారు.