
ప్రస్తుతం దేశంలో ఎవరూ పడని కష్టాన్ని మోడీ పడుతున్నాడు.. తాను తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఇప్పుడు దేశాన్నే కుదిపేస్తోంది. జనం , నాయకులు, ఉద్యోగులు డబ్బుల్లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఈ ఆపద సమయంలో ప్రధాని మోడీకి కేసీఆర్ దిక్కయ్యారు. దేశంలో 29 రాష్ట్రాలున్నాయి. అందులో ఏ సీఎంకు దక్కని గౌరవం కేసీఆర్ కు దక్కిందంటే ఆయన సీనియారిటీ, చతురత ఎంత అర్థం చేసుకోవచ్చు.. ఇంతటి ఘనపాఠి కాబట్టే గురువారం కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని.. అపాయింట్ మెంట్ ఇచ్చి మరీ కేసీఆర్ ను ఢిల్లీకి ఆహ్వానించి ఆయనతో రహస్య మంతనాలు జరిపారు.
ప్రస్తుత సంక్షోభ నివారణకు కేసీఆర్ సలహాలను స్వీకరించారు.. 2.5 లక్షల పరిమితిని ఎత్తివేసి రైతులు, ఉద్యోగులు, మధ్య తరగతి వారికి 10 లక్షల వరకు అన్ కౌంటెడ్ మనీగా దాచుకోవడానికి అవకాశం కల్పించాలని కేసీఆర్ ప్రధానికి సూచించారు. ఇలా చేస్తే దేశంలోని దాదాపు 60శాతం మంది లబ్ధి పొందుతారని స్పష్టం చేశారు. దీనివల్ల మోడీ నిర్ణయం, బీజేపీపై ప్రజలకు కోపం తగ్గుతుందని చెప్పారట.. ఈ సూచన బాగుందన్న మోడీ వెంటనే అధికారులకు చెప్పి దాన్ని అమలు చేయిస్తానని హామీ ఇచ్చారు. చివరకు మోడీ మీ సలహాలు బాగున్నాయంటూ ప్రశంసించడం గమనార్హం.