
రాజ్యసభలో సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రసంగంలో ప్రధానాంశాలు
*130 కోట్ల భారతీయులలో క్రెడిట్ కార్డు ఉన్నది 2.6 కోట్ల మందికి
*130 కోట్ల జనాభాలో 12 లక్షల మంది రీటైల్ అవుట్ లెట్స్ లో కార్డుల వినియోగం సాగిస్తున్నారు
*చెల్లింపుల విధానంలో ఇండియా 80శాతం నగదు మార్పిడి విధానం ఉంది.
* ప్రస్తుతం స్వీడన్ లో మాత్రమే 100శాతం నెట్ బ్యాంకింగ్ సాగుతోంది
* SBI ద్వారా కార్పోరేట్లకు 7వేల కోట్ల ప్రయోజనం కల్పించారు
* నల్లధనం నిల్వ ఉంచరు. అది చెలామణీ అవుతూ ఉంటుంది. 5-6 శాతం నిల్వ ఉంటే ఉండొచ్చు.
* మొత్తం 14.18 లక్షల కోట్ల చెలామణీలో ఉన్న కరెన్సీలో 0.028% లేదా 400 కోట్లు మాత్రమే నకిలీ నోట్లు
* దేశ ప్రజలందరినీ ఇక్కట్లు పాలుజేస్తున్న ప్రభుత్వ నిర్ణయం ద్వారా 2వేల నోటు వాటిని అడ్డుకుంటుందా..ఇప్పటికే బెంగళూరులో దర్శనమిచ్చింది.
* ప్రభుత్వ చిత్తశుద్ధితో వాటిని అరికట్టే ప్రయత్నం చేస్తే మేము అందరికన్నా ముందు నిలిచి మద్ధతిస్తాం.
* మహారాష్ట్ర ప్రభుత్వం పాత 500, వెయ్యి నోట్లను సినిమా హాళ్లలో అనుమతిస్తోంది. మరి కాయగూరలు, ఆహారపు అవసరాల మీద ఎందుకు అనుమతించడం లేదు.
* తీవ్రవాదులకు నగదు ఆన్ లైన్ రూపంలో అందుతోందని పార్లమెంట్ లో చర్చ జరిగింది. మన చట్టాలు వాటిని నియంత్రిచడానికి తగ్గట్టుగా లేకపోవడమే కారణమని ప్రభుత్వం చెప్పింది.
* ఇప్పుడు సాధారణ జనం రోడ్డున పడేసిన నిర్ణయం ద్వారా తీవ్రవాదులకు నగదు అందకుండా, నకిలీ కరెన్సీ చెలామణీలోకి రాకుండా ఎలా అడ్డుకుంటుంది.
* 500, వెయ్యి నోట్లు నల్లధనం, అవినీతి పెంచుతున్నాయని చెప్పి 2వేల నోటు ఎలా తీసుకొచ్చారు
* అవినీతి మూలాలకు అడ్డుకట్ట వేయకుండా నల్లధనం అదుపుచేయలేరు
* అన్ని రాజకీయ పార్టీలకు కార్పోరేట్ నిధులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం
* ప్రభుత్వమే ఎన్నికల వ్యయం భరించేలా మార్పు తీసుకురావడానికి మీరు సిద్ధమా
* రాజకీయ పార్టీల ఖర్చులకు నియంత్రణ పెట్టకుండా అభ్యర్థుల ఖర్చులకు పరిమితం పెట్టామని చెప్పడం ప్రయోజనం ఉండదు. పార్టీల పేరుతో యధేశ్ఛగా కార్పోరేట్ ధనం ఖర్చవుతోంది.
* కోట్లమంది ప్రజలు లావాదేవీలు జరుపుతున్న సహకార బ్యాంకుల్లో పారుబకాయిలు కేవలం 2శాతమే
* ప్రస్తుత నిర్ణయం ద్వారా ప్రజల వ్యక్తిత్వాన్ని, ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చే ఫాసిస్టు విధానం ప్రస్ఫుటమవుతోంది
* 80.8% గ్రామాలకు బ్యాంకులు అందుబాటులో లేవు
* భౌగోళికంగా 93% గ్రామీణ భారతానికి బ్యాంకింగ్ విధానం చేరువలో లేదు.
* 86% గా ఉన్న 500, వెయ్యి నోట్లను రద్దు చేయడం ద్వారా విశాల ప్రజానీకాన్ని ఏం చేయాలనుకున్నారు
* ప్రతీసారి పార్లమెంట్ సమావేశాల్లో ఇలాంటి అంశాన్ని ముందుకు తీసుకురావడం, మొత్తం సమావేశాలను పక్కదారి పట్టించడం అలవాటుగా మారుతోంది.
* కోట్లాది మంది ప్రజలు ఎదుర్కొంటున్న నిరుద్యోగం, పేదరికం, ఆకలి వంటి సమస్యలకు పార్లమెంట్ సమాధానం చెప్పలేకపోతోంది
* పది నెలలుగా సన్నాహాలు చేస్తున్నామని చెప్పిన ప్రధాని దానికి తగ్గట్టుగా ప్రత్యామ్నాయం ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు