ఇక చాలు మీసేవలు.. సాగనంపుతున్నాడు..

ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో భాగంగా పనిచేయని.. సరిగ్గా కేంద్రమంత్రులుగా విఫలమైన వారికి ఉద్వాసన పలికేందుకు సిద్ధమయ్యారు. ఇక వీరి స్థానంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారు..

ఈ కొత్త కేబినెట్ పునర్వ్యస్థీకరణలో దళితులు, ఈబీసీలకు మోడీ పెద్ద పీట వేస్తున్నారు, యూపీ ఎన్నికలే లక్ష్యంగా అక్కడి సామాజికవర్గాలను మచ్చిక చేసుకునే పనిలో ఆ రాష్ట్రం నుంచి ఎక్కువ మందికి మంత్రి పదవులు ఇస్తున్నారు.. కాగా 75 ఏళ్లు దాటిని సీనియర్ కేబినెట్ మంత్రులకు పనిభారం వల్ల విశ్రాంతి నిస్తున్నారు. ఇక మిత్రపక్షం శివసేనకు ఒక్క సహాయ మంత్రి పదవి ఇవ్వచూపినా ఆ పార్టీ వద్దన్నడంతో అదీ దక్కడం లేదు..

కేంద్ర మంత్రుల్లో కొత్తగా చేరే వారిలో ఎంజే అక్బర్, రాందాస్, రూపాలా, కృషన్రాజ్, అహ్లూవాలియా, పాండే, అనుప్రియ పటేల్ , అజయ్ టమాటా ఉన్నారు..

ఇక ఉద్వాసన పలికే వారిలో కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ, నజ్మాహెప్తుల్లా, సన్వర్ లాల్ జాట్, నిహాల్ చంద్, రాంకృపాల్ యాదవ్,గిరిరాజ్ సింగ్, రాంశంకర్ కతేరియా, కల్రాజ్ మిశ్రా,  రాధామోహన్ సింగ్  పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *