మోడీ కేబినెట్ నుంచి వైదొలిగిన ఇద్దరు మంత్రులు

బీజేపీ ప్రభుత్వంలో పనిచేయని, వృద్ధులకు ఉద్వాసన పలుకుతున్న ప్రధాని అభీష్టానికనుగుణంగా ఇద్దరు కేంద్రమంత్రులు వైదొలగారు. ప్రధాని నరేంద్రమోడీ మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణతో పలువురి శాఖల్ని మార్చారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జీఎం సిద్దేశ్వర మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోదించారు. దీంతో మైనార్జీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీకి ఆ శాఖ పూర్తి బాధ్యతలు అప్పగించారు..

కాగా కొత్తగా పార్లమెంటు వ్యవహారాలు అనంత్ శర్మకు వచ్చాయి. వెంకయ్యను పార్లమెంటు వ్యవహారాల నుంచి వైదొలిగారు. ఇక కేంద్ర పట్టాణాభివృద్ది శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియాకు భారీ పరిశ్రమల శాక బాధ్యతలను అప్పగించారు. తాజా మార్పులతో మోడీ కేబినెట్ మంత్రుల సంఖ్య 78కి చేరింది.. వీరిద్దరు రాజీనామాలను మినహాయిస్తే 76కు చేరింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *