ఇదేంది ఎమ్మెల్యే.. గెలిపించినోళ్లను బెదిరిస్తావా..?

ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య తనను గెలిపించిన ప్రజలనే బెదిరించారు. సమస్యలపై నిలదీసినందుకు మళ్ల ీలొల్లి చేస్తే మీ ఊళ్లో కాలు పెట్టా అంటూ హెచ్చరించాడు.. కాసిపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే అక్కడ హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వర్షాలకు డ్రైనేజీలు పొంగిపొర్లాయని.. ఇంట్లోకి వచ్చాయని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఎమ్మెల్యే కాన్వాయిని అడ్డుకొని నిరసన తెలిపారు. ఇప్పటికే డయేరియా, అతిసారతో ఇద్దరు చనిపోయారని.. తమకు డ్రైనేజీలు, నీటివసతి కల్పించాలని ఎమ్మెల్యేను నిలదీశారు..

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ‘నన్ను నిలదీస్తారా.. మళ్లీ ఊళ్లో కాలు పెట్ట’ అంటూ హెచ్చరించాడు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి ఆ గ్రామస్థులు హతాశులయ్యారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *